శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Jan 16, 2021 , 00:28:44

కుటుంబ సభ్యుల చెంతకు మతిస్థిమితంలేని మహిళ

కుటుంబ సభ్యుల చెంతకు మతిస్థిమితంలేని మహిళ

నారాయణపేట, జనవరి 15 : మతిస్థిమితం లేకుండా కొన్నిరోజులుగా పట్టణంలో తిరుగుతున్న ఓ మహిళను పేట పోలీసులు కుటుం బ సభ్యుల చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళ్తే.. జోగుళాంబ గద్వాల జిలా మల్దకల్‌ మండలానికి చెందిన సవరమ్మ మతిస్థిమితం సరిగా లేక నిరాశ్రయురాలై కొన్ని రోజుల నుంచి పట్టణంలో తిరుగుతున్నది. ఎస్పీ చేతన సూచన మేరకు ఎస్సై చంద్రమోహన్‌రావు మహిళతో వివరాలు అడిగి తెలుసుకొని మల్దకల్‌ పోలీసుల సహకారంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


VIDEOS

logo