సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Jan 16, 2021 , 00:28:42

హెచ్‌ఆర్‌ఎంఎస్‌తో అంతర్గత సామర్థ్యం పెంపు

హెచ్‌ఆర్‌ఎంఎస్‌తో అంతర్గత సామర్థ్యం పెంపు

నారాయణపేట, జనవరి 15 : హెచ్‌ఆర్‌ఎంఎస్‌ (హ్యూమన్‌ రిసోర్స్‌ మెనేజ్‌మెంట్‌ సిస్టం)తో పోలీస్‌ వ్యవస్థ అంతర్గత సామర్థ్యం పెంచుకోవచ్చని ఎస్పీ చేతన అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో హెచ్‌ఆర్‌ఎంఎస్‌ అప్లికేషన్‌లో సర్వీస్‌ మాడ్యూల్‌, రిక్రూట్మెంట్‌ మా డ్యూల్‌ అప్‌లోడ్‌పై పోలీస్‌ అధికారులకు డ్రైరన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో పోలీస్‌ శాఖ కాగిత రహిత సేవలను అందించేందు కు హెచ్‌ఆర్‌ఎంఎస్‌ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇందులో ఉద్యోగి సర్వీస్‌కు సంబందించి పూర్తి డేటాను ఆ న్‌లైన్‌లో నిక్షిప్తం చేయవచ్చని, పోలీస్‌ శాఖను మరింత బ లోపేతం చేయడానికి, పౌరకేంద్రీకృత పరిపాలనకు సహాయకారిగా హెచ్‌ఆర్‌ఎంఎస్‌ ఉంటుందని వివరించారు.  కా ర్యక్రమంలో అదనపు ఎస్పీ (డీసీఆర్‌బీ) భరత్‌, సీఐ ఇప్తికర్‌ అహ్మద్‌, డీపీవో రత్నకుమారి, ఐటీ కోర్‌ సిబ్బంది, పో లీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


VIDEOS

logo