బుధవారం 24 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 16, 2021 , 00:28:42

వ్యాక్సినేషన్‌లో ఇబ్బందులు ఏర్పడొద్దు

వ్యాక్సినేషన్‌లో ఇబ్బందులు ఏర్పడొద్దు

  • కలెక్టర్‌ హరిచందన

నారాయణపేట టౌన్‌, జనవరి 15 : వ్యాక్సినేషన్‌ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ హరిచందన అధికారులకు ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశం లో కలెక్టర్‌ మాట్లాడారు. ఈ నెల 8న కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైర న్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాక్సినేషన్‌ ప్రా రంభించిన అనంతరం జిల్లా కేంద్రంలోని జిల్లా దవాఖాన, మక్తల్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రం, మరికల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాలని అధికారులకు సూచించామన్నారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ఇం టర్నెట్‌ సౌకర్యానికి అంతరాయం కలుగకుండా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, డీఎంహెచ్‌వో జయచంద్రమోహన్‌, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ మల్లికార్జున్‌, ఎన్‌సీడీ పీవో సిద్ధప్ప, డాక్టర్‌ బా లాజీ సింగాడే, మాస్‌ మీడియా అధికారి హన్మంతు తదితరులు ఉన్నారు. 


VIDEOS

logo