బుధవారం 27 జనవరి 2021
Narayanpet - Jan 14, 2021 , 00:35:19

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

ధన్వాడ, జనవరి 13 : చెరువుల్లో చేపలు పట్టడానికి మత్స్యకారులకే అవకా శం కల్పించడం, 18 ఏండ్లు నిండిన యు వకులకు మత్స్యసహకార సంఘం సభ్యులుగా అవకాశం కల్పించడంతో బుధవా రం మండల కేంద్రంలోని మత్స్య కార్మిక సంఘం కార్యాలయంలో సీఎం కేసీఆర్‌, మంత్రులు శ్రీనివాస్‌యాదవ్‌, ఈటల రా జేందర్‌ చిత్రపటాలకు ముదిరాజ్‌ సం ఘం ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు.  అనంతరం పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో సంఘం మండలాధ్యక్షుడు నర్సింహులు నాయు డు, మత్య్సకారులు పాల్గొన్నారు.

నేడు ఆర్య సమాజంలో యజ్ఞం

నారాయణపేట, జనవరి 13 : సం క్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప ట్టణంలోని ఆర్య సమాజ మందిరంలో గురువారం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆర్య సమాజం మంత్రి కృష్ణ భగవాన్‌ బుధవారం ప్రకటనలో తె లిపారు. యజ్ఞం, భజనలు, సందేశం, ను వ్వులు, చక్కెర వితరణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.


logo