సినీ ఇండస్ట్రీలో ఎంతో డెడికేషన్‌తో పని చేసే నటులలో విక్రమ్ ఒకరు. తన తొలి సినిమా నుండి ఎంతో నిబద్ధతో పని చేశారు. పాత్ర కోసం ఎంత రిస్క్ చేయడానికైన ఆయన రెడీ. ‘అపరిచితుడు’ ‘ఐ’ ‘ఇంకొక్కడు’ ఇలా తన కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేశాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో కోబ్రా అనే సినిమాలో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. విక్రమ్ టోటల్ గా ఈ సినిమాలో ఏడు క్యారెక్టర్స్ పోషిస్తున్నట్లు తెలుస్తుంది.
కోబ్రా చిత్రంలో విక్రమ్ ప్రతి పాత్ర కూడా డిఫరెంట్‌గా ఉంటుందట. ఆ క్యారెక్టర్ చేసింది విక్రమేనా అనేలా అతని పాత్ర ఉంటుందని అంటున్నారు. ఇటీవల ఓ రిస్కీ స్టంట్‌ని డూప్ లేకుండా చేసి అందరిని ఆశ్చర్యపరిచాడట విక్రమ్. తాజాగా విక్రమ్ లుక్‌కి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇందులో వైట్ మీసాలతో బ్లాక్ గడ్డంతో ఉండగా, ఇతను విక్రమేనా అనే అనుమానం అభిమానులలో కలుగుతుంది. విక్రమ్ డెడికేషన్ లెవెల్స్ గురించి సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమాలో మాజీ క్రికెట్ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ గా నటిస్తుండగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా కనిపించనుంది. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.