అభివృద్ధికి @ ఎస్‌ఆర్‌రెడ్డి

నారాయణపేట, జనవరి 12 : ఎంతో వెనుకబడిన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి నిలుస్తున్నారని టీఆర్ఎస్ మున్సిపల్ ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చంద్రకాంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి, నియోజకవర్గ యువజన నాయకుడు శ్రీపాద్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ను ఒప్పించి నారాయణపేటను జిల్లాగా చేసిన ఘనత ఎమ్మెల్యేదేనని అన్నారు. అంతర్రాష్ట్ర రహదారి అభివృద్ధికి రూ.20కోట్ల వ్యయంతో డబుల్ రోడ్డుగా మార్చి, ప నులు చేయిస్తున్నాడన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అంత్వార్ సమీపంలో 300 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఇంత అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నా యకులు కలెక్టరేట్ ముట్టడి పేరుతో తమ ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ డాక్టర్ కె.నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ జగదీశ్, కౌన్సిలర్లు, నా యకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్‌లోకి ఎస్బీఐ?.. అందుకే..!
- ‘బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడటమే మా ప్రాధాన్యత’
- న్యాయవాద దంపతుల హత్యకు వాడిన కత్తులు లభ్యం
- తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తాం : అసదుద్దీన్ ఒవైసీ
- ప్రచార పర్వం : టీ కార్మికులతో ప్రియాంక జుమర్ డ్యాన్స్
- సంత్ సేవాలాల్ మహరాజ్ నిజమైన సేవకుడు
- నాంది హిందీ రీమేక్..హీరో ఎవరంటే..?
- పాఠశాలలో మరిన్ని వసతులు కల్పిస్తాం : మంత్రి కొప్పుల
- మళ్లీ పెరిగిన పసిడి ధర
- వ్యాక్సిన్‌తోనే మహమ్మారికి అడ్డుకట్ట : ఎయిమ్స్ చీఫ్