గురువారం 04 మార్చి 2021
Narayanpet - Jan 11, 2021 , 00:27:28

శబరిమల దర్శనానికి వెళ్లి..

శబరిమల దర్శనానికి వెళ్లి..

  • గుండెపోటుతో యువకుడు మృతి 

  దామరగిద్ద, జనవరి 10 : నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన యువకుడు గిరిగేనూర్‌ నరేశ్‌ (26) శబరి అయ్యప్ప దర్శనానికి వెళ్లి మృతి చెందాడు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అయ్యప్ప స్వామి దర్శనానికి రెండ్రోజుల కిందట అతను పాదయాత్రగా బయలుదేరాడు. ఆదివారం ఉదయం స్వామిని దర్శించుకునే క్రమంలో నరేశ్‌ స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే తోటి స్వాములు అతడిని సమీపంలోని దవాఖానకు తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసే నరేశ్‌కు భార్య, తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నాడు. 


VIDEOS

logo