ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Jan 11, 2021 , 00:27:26

ముదిరాజ్‌ భవనం భూమిపూజకు తరలిన నాయకులు

ముదిరాజ్‌ భవనం భూమిపూజకు తరలిన నాయకులు

నారాయణపేట, జనవరి 10:  హైదరాబాద్‌లో తెలంగాణ ముదిరాజ్‌ భవనం నిర్మాణానికి ఆదివారం చేపట్టిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు నారాయణపేట పట్టణంతోపాటు, మండలానికి చెందిన ముదిరాజ్‌ సంఘం నాయకులు బయల్దేరారు. జెడ్పీటీసీ అంజలి రాములు, కాశీనాథ్‌, కృష్ణ, యాదగిరి, వెంకట్రాములు, నవీ న్‌, రిషికుమార్‌ తదితరులు తరలివెళ్లారు.

 ధన్వాడ నుంచి..

ధన్వాడ, జనవరి10: హైదరబాద్‌లోని కోకా పేటలో నూతనంగా నిర్మిస్తున్న ముదిరాజ్‌ భవన నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో మండల ముదిరాజ్‌ సంఘం నాయకులు పాల్గొన్నారు. అదివారం జరిగిన భూమి పూజ కార్యక్రమంలో మత్స్య పారిశ్రమిక సహకార సంఘం అధ్యక్షుడు నీరటి నర్సింహులు నాయుడు, మాజీ ఎంపీటీసీ గౌని శ్రీనివాసులు, సచిన్‌తోపాటు వివిధ గ్రామాలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

మక్తల్‌నుంచి..

మక్తల్‌ టౌన్‌, జనవరి 10:  మక్తల్‌ పట్టణంలోని మక్తల్‌ ముదిరాజ్‌ భవన కార్యాలయంనుంచి మక్తల్‌ ముదిరాజ్‌, మత్స్య సంఘం నాయకులు  హైదరాబాద్‌లోని కోకాపేటలో నిర్మిస్తున్న ముదిరాజ్‌ భవనం భూమిపూజ కా ర్యక్రమానికి తరలి వెళ్లారు. కార్యక్రమంలో  కోళ్ల వెంకటేశ్‌, కావలి శ్రీ హరి, మధు, రవికుమార్‌ తదితరు లు పాల్గొన్నారు 


VIDEOS

logo