ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Jan 10, 2021 , 01:10:18

మున్సిపాలిటీలో కొనసాగుతున్న పనులు

మున్సిపాలిటీలో కొనసాగుతున్న పనులు

మక్తల్‌ టౌన్‌, జనవరి 9: మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు ఏఈ నాగశివ తెలిపారు. శనివారం మక్తల్‌లో మున్సిపల్‌ సమావేశ భవన నిర్మాణం పనులను ఏఈ పరిశీలించారు.మున్సిపాలిటీలో డంపింగ్‌ యార్డు, సమీకృత మార్కెట్‌, మున్సిపాలిటీ సమావేశ భవన నిర్మాణాల పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. రూ. 40లక్షలతో డంపింగ్‌ యార్డు,  రూ. 58 లక్షలతో సమీకృత మార్కెట్‌ పనులు, రూ. 40లక్షలతో డంపింగ్‌ యార్డు పనులు చురుగ్గా సాగుతున్నట్లు తెలిపారు.  అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీకి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి రూ.58కోట్లు విడుదల చేయించారని తెలిపారు. డ్రైనేజీ నిర్మాణానికి ప్లానింగ్‌ కోసం మున్సిపాలిటీ పాలకవర్గం ఏజెన్సీకి అప్పగించినట్లు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో, ప్రభుత్వ దవాఖానలో, 14వ వార్డులో  ప్రారంభించిన పే అండ్‌ యూజ్‌ టాయిలెట్ల నిర్వహణకు నిధులు లేకపోవడంతో ఉన్నతాధికారులతో మాట్లాడతానని ఏఈ తెలిపారు.

VIDEOS

logo