శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Jan 10, 2021 , 01:10:27

డయల్‌ 100 కాల్స్‌పై స్పందించాలి

డయల్‌ 100 కాల్స్‌పై  స్పందించాలి

నారాయణపేట, జనవరి 9:  డయల్‌ 100 కాల్స్‌పై వెంటనే స్పందించాలని ఎస్‌హెచ్‌వోలు తెలిపారు. శనివారం జిల్లాలోని పోలీస్‌స్టేషన్లలో పోలీస్‌ సిబ్బంది, కోర్టు డ్యూటీ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో జరిగిన కేసులు, పడిన శిక్షలు, వీగిపోయిన కేసుల లోపాలను చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌కు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారందరూ సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి సమస్యలు ఎదురైనా పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కోర్టు డ్యూటీ అధికారులు సమర్థవంతంగా వ్యవహరిస్తూ నిందితులకు సరైనరీతిలో శిక్షలు పడేలా చేసి సకాలంలో బాధితులకు న్యాయం చేయాలన్నారు. కోర్టు ప్రాసిక్యూటర్‌, కోర్టు సిబ్బందితో సమన్వయాన్ని కొనసాగించాలని సూచించారు. కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌, విచారణలో సమర్థవంతంగా ఇన్వెస్టిగేషన్‌, ప్రాసిక్యూషన్‌ చేయాలన్నారు.  కోర్టుల్లోని వివిధ అధికారులను సమన్వయపరుస్తూ సాక్షులు, నిందితులను కోర్టులో హాజరు పరచాలన్నారు. పోలీస్‌ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం, గౌరవం పెరగడానికి తమవంతు పాత్రను పోషించాలన్నారు. కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటించి, ఆదేశాలను సకాలంలో ఉన్నతాధికారులకు చేరవేయాలన్నా రు.  


VIDEOS

logo