సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Jan 09, 2021 , 00:18:58

పార్కు నిర్మాణానికి ఎమ్మెల్యే చిట్టెం భూమి పూజ

పార్కు నిర్మాణానికి ఎమ్మెల్యే చిట్టెం భూమి పూజ

మక్తల్‌ టౌన్‌, జనవరి 8: మున్సిపాలిటీలో రూ. 20 లక్షలతో అభివృద్ధి పను లు ప్రారంభించామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మక్తల్‌ మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డులోని గార్లపల్లి గ్రామంలో పార్క్‌ నిర్మాణానికి ఎమ్మె ల్యే  భూమి పూజ నిర్వహించారు.చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్‌ నిర్మాణంలో గార్లపల్లి ముంపుగ్రామం కావడంతో కొత్తగా ఏర్పడిన పునరావాస గ్రామానికి శ్మశాన వాటిక  కావాలని గ్రామస్తులు కోరడంతో ఎమ్మెల్యే శ్మశాన వాటికకు స్థలాన్ని పరిశీలించి వైకుంఠధామం నిర్మించేందుకు ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ  అధికారులను ఆదేశించారు.  రూ. 30 లక్షలతో  పే అండ్‌ యూస్‌ టాయిలెట్స్‌ నిర్మించగా వాటి నిర్వహణ లేక వాడుకలో లేవని, వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా  అధికారులు నిధులు విడుదలు చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ పావని, వైస్‌ చైర్‌పర్సన్‌ అఖిల,  ఏఈ నాగశివ, కౌన్సిలర్‌ ప్రసన్న, బీజేపీ నాయకులు బలరాంరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మక్తల్‌ పట్టణంతోపాటు మండలంలోని 39 గ్రామాలకు చెందిన 83 మందికి కల్యాణలక్ష్మి  చెక్కులను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి  అందజేశారు.  కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ రాజేశ్‌గౌడ్‌, ఎంపీపీ వనజ, తాసిల్దార్‌ నర్సింగ్‌రావు, కౌన్సిలర్లు జగ్గలి రాములు, నర్సింహులు, నాయకులు శాలం, శంషొద్ద్దీన్‌,రాజమహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo