శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 08, 2021 , 00:26:33

డ్రైరన్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి

డ్రైరన్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి

  • కలెక్టర్‌ హరిచందన

నారాయణపేట టౌన్‌, జనవరి7: జిల్లాలో డ్రైరన్‌ కార్యక్రమ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్‌ హరిచందన వైద్యాధికారులకు సూచించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో కొవిడ్‌-19 టీకా డ్రైరన్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 11ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా దవాఖానలో డ్రైరన్‌ నిర్వహించాలన్నారు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి కేంద్రంలో 3గదులను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి వ్యాక్సినేషన్‌ కేంద్రానికి ఒక వ్యాక్సినేటర్‌, నలుగురు వ్యాక్సినేషన్‌ సహాయకులకు శిక్షణ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహించాలన్నారు. ప్రతి కేంద్రంలో 25 మంది ఆశ కార్యకర్తలకు డ్రైరన్‌ నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.జయచంద్రమోహన్‌, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డా.శైలజ, డా.రంజిత్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo