గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 08, 2021 , 00:26:36

టీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి

టీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి

  • రైతులకు అవగాహన కల్పించేందుకే రైతువేదికలు 
  • ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కోస్గి, జనవరి 7: కేసీఆర్‌ హయాంలోనే పల్లెలన్నీ అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.  గురువారం మద్దూర్‌ మండలంలోని ఎక్కమేడ్‌ గ్రామంలో రైతువేదిక, పల్లెప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూలేని విధంగా పల్లెలు పచ్చబడ్డాయన్నారు. ప్రజలు సేదతీరేందుకు ప్రకృతివనాలు ఉపయోగపడతాయన్నారు. రైతువేదికలు ఏర్పాటుచేసి రైతులను ఏకంచేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. రైతులకు అవగాహన కల్పించేందుకు రైతువేదికలు ఉపయోగపడతాయన్నారు. అనంతరం సపాన్‌చురువుతండా, చింతల్‌దిన్నె గ్రామాల్లో సీసీరోడ్డును ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. 


VIDEOS

logo