బ్లాక్ స్పాట్లను గుర్తించాలి

- రోడ్డు భద్రతా సమావేశంలో కలెక్టర్, ఎస్పీ
నారాయణపేట టౌన్, జనవరి 6: వాహనాలు అతి వేగంగా వెళ్లకుండా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని, ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి అక్కడ మళ్లీ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హరిచందన, ఎస్పీ చేతన అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పోలీస్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, వైద్య, ఎక్సైజ్‌శాఖ అధికారులతో రోడ్ సేఫ్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రమాదాలు చోటుచేసుకోకుండా సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లను తొలగించాలని, రోడ్డుపై, రోడ్డు పక్కన ఉన్న గుంతలను మరమ్మతు చేయించాలన్నా రు. పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పాయింట్లను గుర్తించి ప్రపోజల్స్ పంపించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, నివారణపై జాతీయ రహదారి సమీపాన ఉన్న గ్రామా ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రహదారిలో తప్పని సరిగా అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. ఓవర్‌లోడ్ ఉన్న వాహనాలను పరిశీలించి, డ్రైవర్లకు అవగాహన కల్పించి, లైసెన్స్ లేనివారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చూడాలన్నారు. జిల్లాలో ట్రామా సెంటర్ల ఏర్పాటుకు ప్రపోజల్స్ పంపించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- విపణిలోకి బజాజ్ ఈవీ ప్లాటినా 100.. ధరెంతంటే?!
- చౌకధరకే టెస్లా విద్యుత్ కారు!
- ఆ టైంలో అందరూ భయపెట్టారు: అమలా పాల్
- ఖాదర్‌బాషా దర్గాను సందర్శించిన హోంమంత్రి
- హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
- యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
- ఆస్తి పన్ను పెంపు దారుణం : చంద్రబాబు
- స్మృతి మందాన@6
- ‘నాంది’ 11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
- వామన్‌రావు దంపతుల హత్య బాధ కలిగించింది : కేటీఆర్