ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Jan 06, 2021 , 00:50:03

నేడు విద్యుత్‌ సారె యంత్రాల పంపిణీ

నేడు విద్యుత్‌ సారె యంత్రాల పంపిణీ

నారాయణపేట టౌన్‌, జనవరి 5 : కుమ్మరి కులస్తులకు విద్యుత్‌ సారె యంత్రాలను బుధవారం కలెక్టర్‌ హరిచందన పంపిణీ చేయనున్నట్లు మెప్మా పీడీ కృష్ణమాచారి అన్నారు. యంత్రాల సరఫరా పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో శిక్షణలో పాల్గొన్న వారికి అందజేశారు. మంగళవారం శిక్షణ కాలంలో మట్టితో తయారు చేసిన వివిధ రకాల వస్తువులను ఆయన పరిశీలించారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషనర్‌ హైదరాబాద్‌ వారి నుంచి మంజూరైన విద్యుత్‌ సారె యంత్రాలపై ఎంపిక చేసిన 20 మందికి 10 రోజులపాటు శిక్షణ అందించినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో మెప్మా టీఎం సీ లక్ష్మి పాల్గొన్నారు.


VIDEOS

logo