సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Jan 06, 2021 , 00:50:05

వ్యవస్థలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి

వ్యవస్థలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి

నారాయణపేట, జనవరి 5 : పోలీస్‌స్టేషన్‌ల్లో సెక్షన్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించే అధికారి స్టేషన్‌ పరిధిలోని పరిస్థితు లు, ప్రజలు, వివిధ వ్యవస్థలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ డాక్టర్‌ చేత న అన్నారు. మంగళవారం జిల్లాలోని వివి ధ పోలీస్‌స్టేషన్ల సెక్షన్‌ ఇన్‌చార్జి అధికారుల కు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఒక రోజు శి క్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎస్‌హెచ్‌వోల సూచనల మేరకు పరిస్థితులకు అనుగుణం గా విధుల విభజన, స్టేషన్‌ నిర్వహణ వం టి బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉండే లా సంబంధిత సిబ్బందిని పర్యవేక్షించి త గిన చర్యలు తీసుకోవాలన్నారు. స్టేషన్‌ పరిధిలో బిట్లు, పెట్రోల్‌ కార్స్‌, బ్లూ కోర్స్‌ అధికారులను సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి సూచనలు అందించాలని ఆమె చెప్పారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు సరైన సౌకర్యాలు కల్పించాలని, ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ వీహెచ్‌ఎఫ్‌, సెట్‌ ఫోన్‌కు బాధ్యత వహించాలన్నా రు. ఎస్‌హెచ్‌వో సూచనల మేరకు సిబ్బందికి విధులు కేటాయించాలన్నారు. ప్రజ లు, ఆఫీస్‌ అధికారులు, వివిధ విభాగాల అధికారులతో సమన్వయంతో పని చేయాలన్నారు. 

VIDEOS

logo