నియామకాల ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు

- అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పించాలి
- ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్
నారాయణపేట టౌన్, జనవరి 5 : ప్రభుత్వం అన్ని ప్ర భుత్వ కార్యాలయాల్లోని క్యాడర్లకు పదోన్నతులు కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని, అందుకుగా నూ ఈ నెల 24వ తేదీ లోగా డీపీసీలు పూర్తి చేయడంతో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పదోన్నతులు కల్పించడం, కారుణ్య నియామకాల ప్రక్రియను ఈ నెల 31 లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ కార్యదర్శులు సందీప్‌కుమా ర్ సుల్తానియా, రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పదోన్నతులు, కారుణ్య నియామకాలు, ధరణి పార్ట్ బి, అపరిష్కృత కేసులు, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్ర భుత్వ కార్యాలయాల్లో పదోన్నతులు కల్పించాల్సిన పోస్టు లు, ఖాళీలను గుర్తించామని, మార్చి 31 లోగా అర్హులైన వారందరికీ పదోన్నతి కల్పించడంతోపాటు కారు ణ్య నియామకాల కోసం ఎదురు చూ స్తున్న దరఖాస్తులన్నింటినీ పరిశీలిస్తామన్నారు. తద్వారా వివిధ శాఖల్లో ఖా ళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ధరణి పోర్టల్ పార్ట్ బిలో పెండింగ్ కేసులను పరిశీలించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరించేందుకు చ ర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి హామీలో పని దినాలు పెంచి జాబ్‌కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ 100 రోజుల పని దినాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వీసీలో ఆర్డీవో శ్రీనివాసు లు, డీఆర్డీవో కాళిందిని, డీపీవో మురళి, జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌సుధాకర్ పాల్గొన్నారు.