శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 05, 2021 , 02:41:49

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి

  • కలెక్టర్‌ హరిచందన 

నారాయణపేట టౌన్‌, జనవరి 4 : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని కలెక్టర్‌ హరిచందన అన్నారు. నూతన ఏడాది పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి కేక్‌ కట్‌ చేసి అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ నారాయణపేట జిల్లా అంటే వెనుక బడిన జిల్లా అని, సౌకర్యాలు లేని జిల్లా అనే అభిప్రాయం ఉందని, దీనిని మార్చి అభివృద్ధి చెందిన జిల్లాగా మార్చేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

కాలెండర్‌ ఆవిష్కరించిన కలెక్టర్‌...

నవ యువత యువజన సం ఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఏడాది క్యాలెండర్‌ను కలెక్టర్‌ హరిచందన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ సమాజ సేవలో యువత ముందుండాలన్నారు. యువజన సంఘాల సేవా కార్యక్రమాలు నేడు సమాజానికి ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, సంఘం నాయకులు పాల్గొన్నారు. 


VIDEOS

logo