ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 05, 2021 , 02:39:42

ఫిర్యాదులను చట్టప్రకారం పరిష్కరించాలి

ఫిర్యాదులను చట్టప్రకారం పరిష్కరించాలి

నారాయణపేట, జనవరి 4 : ఫిర్యాదులను చ ట్టప్రకారం పరిష్కరించాలని ఎస్పీ డాక్టర్‌ చేతన అన్నారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ దినం సందర్భంగా పట్టణంలోని ఎస్పీ కార్యాలయానికి జిల్లాలోని వివిధ మండలాల నుంచి 5 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని స్వీకరించి పరిశీలించారు. అనంతరం ఎస్పీ ఫిర్యాదుదారులతో నే రుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్ర జావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చట్టప్రకారం పరిష్కరించి బాధితులకు న్యాయం చే యాలని సీఐలు, ఎస్సైలను ఆదేశించారు. సివిల్‌ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలన్నారు. కొవిడ్‌ కారణంగా ఫిర్యాదుదారులు ఫిర్యాదు బా క్స్‌లను వినియోగించుకోవాలన్నారు. అత్యవసర సమయంలో 100కు డయల్‌ చేయాలన్నారు.  


VIDEOS

logo