శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Jan 04, 2021 , 00:38:28

పందుల పందాలు

పందుల పందాలు

మక్తల్‌ రూరల్‌, జనవరి 3 : సంక్రాంతి పండుగ వ స్తుందంటే చాలు కోళ్ల పం దేళ్లు... పొట్టేళ్ల పందేలు చూ స్తుంటాం. కానీ అందుకు భిన్నంగా కాట్రేవుపల్లిలో వ రాహాలతో పందాలు కాస్తున్నారు. ఈ పందేళ్లో వేల రూపాయలు చేతులు మారుతున్నయి. మండలంలోని కాట్రేవుపల్లి గ్రామ శివారులో వరాహాల తో పందాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జోరుగా బెట్టింగులు సా గుతూ పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి. పట్టపగలు ఇంత జోరుగావరాహాలతో పందాలు కొనసాగుతన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం విశేషం. జిల్లా వాసులే కాకుండా సమీపంలోని కర్ణాటక, ఏపీలోని కర్నూలు నుంచి పలువురు వరహాల పందాల్లో పాల్గొంటున్నారు.


VIDEOS

logo