ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 04, 2021 , 00:26:45

బాలికల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయాలి

బాలికల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయాలి

  • నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

నారాయణపేట, జనవరి 3 : మహిళా ఉపాధ్యాయులు బాలికల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయాలని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి అన్నారు. సావిత్రీబా యి ఫూలే జయంతి సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పీఆర్టీయూ టీఎస్‌ జిల్లా శాఖ ఆ ధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సావిత్రీబాయి ఫూలే ఆధునిక భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలని పేర్కొన్నారు. మహిళా విద్యాభివృద్ధికి ఆమె ఎంతో కృషి చేశారన్నారు. అనంతరం పీఆర్టీయూ టీఎస్‌ డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ జగదీశ్‌, పట్టణ అధ్యక్షులు రాజవర్ధన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు...

పట్టణంలోని క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని పీఈటీలు మర్యాదపూర్వకంగా కలిసి నూతన ఏ డాది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పీఈటీలు కతలప్ప, బాలరాజు, వెంకటప్ప, సాయినాథ్‌, అనంతసేన, ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు.  

మరికల్‌ మండలంలో...

మరికల్‌, జనవరి 3 : సావిత్రీబాయి ఫూలే జయంతిని మండల కేంద్రంలో ఘనంగా జరుపుకొన్నారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలోని మహిళలకు విద్యానందించాలని పోరాడిన ధీరవనిత సావిత్రీబాయి అని బీఎస్పీ నారాయణపేట నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాస్‌ అన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ పేట జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు ముదిరాజ్‌, మండలాధ్యక్షుడు రామాంజనేయులు, నాయకులు పాల్గొన్నారు.

పలు సంఘాల ఆధ్వర్యంలో...

ఊట్కూర్‌, జనవరి 3 : సావిత్రీబాయి ఫూలే ఆలోచన విధానాలను ప్రతిఒక్కరూ ముందుకు తీసుకుపోవాలని సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఫూలే జయంతి వేడుకలను అంబేద్కర్‌ సంఘం మండలాధ్యక్షుడు దశరథ్‌ అధ్యక్షతన మండల కేంద్రంలో ఘనంగా ని ర్వహించారు. ఆమె చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. ఏబీవీపీ నగర అధ్యక్షుడు భాస్కర్‌ అధ్యక్షతన సావిత్రీబాయి ఫూలే జయంతి వే డుకలు నిర్వహించారు. కార్యక్రమం లో మాజీ ఉపసర్పంచ్‌ గోపాల్‌, వార్డు సభ్యులు, సామాజిక కార్యకర్త నారాయణ పాల్గొన్నారు. 

ఆశయాలను కొనసాగిద్దాం

కృష్ణ, జనవరి 3 : సావిత్రీబాయి ఫూలే ఆశయాలను కొనసాగిదామని ఎంపీపీ పూర్ణిమ, జడ్పీటీసీ అంజన మ్మ, సర్పంచ్‌ రాధ అన్నారు. మండల కేంద్రంలోని క్షీరలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆమె జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ సావిత్రీబాయి ఫూలే ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మం డలాధ్యక్షుడు విజయపాటీల్‌, నాయకులు పాల్గొన్నారు. 

ధన్వాడ మండలంలో...

ధన్వాడ, జనవరి 3 : మండలంలోని గోటూర్‌లో సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో సావిత్రీబాయి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించా రు. కార్యక్రమంలో రాజ్‌కుమార్‌, మెగులయ్య, రాజేశ్‌కుమార్‌, రవి, శ్రీను, కవిత, రాధ, మౌనిక, రాఘవేందర్‌, ఎల్లన్న, వరలక్ష్మి పాల్గొన్నారు.

కోస్గి మండలంలో...

కోస్గి, జనవరి 3 : సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలు మండలంలో ఘనంగానిర్వహించారు. మండల వి ద్యా వనరుల కేంద్రంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు సావిత్రీబాయి ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సింహులు, సాయప్ప, శ్రీనివాస్‌, శివరాములు, పుల్లప్ప, రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

నర్వ మండలంలో...

నర్వ, జనవరి 3 : సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలను మండల కేంద్రంలో పలు కుల సంఘాల నాయకు లు, రాజకీయ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. 

అమ్మస్మారక గ్రంథాలయంలో...

మక్తల్‌ టౌన్‌, జనవరి 3 : దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే అని నర్సింహులు అన్నా రు. పట్టణంలో అమ్మస్మారక గ్రంథాలయంలో సావిత్రీబా యి ఫూలే జయంతి సందర్భంగా అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ ంలో తెలంగాణ విద్యావంతుల వేదిక కన్వీనర్‌ ఎం. నర్సింహులు, అంబేద్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు నర్సింహులు, నాయకులు పాల్గొన్నారు.

గండీడ్‌ మండలంలో..

గండీడ్‌, జనవరి 3 : సావిత్రీబాయి ఫూలే జయంతిని మండలంలోని పగిడ్యాలలో అంబేద్కర్‌ యువజన సం ఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

VIDEOS

logo