గోఆధారిత వ్యవసాయం

- తక్కువ ఖర్చు.. అధిక దిగుబడి
- ఆవు మూత్రం, పేడతో సాగు
- ప్రకృతి సేద్యంతో కూరగాయల తోటలు
- ఆదర్శం.. రైతు పాపిరెడ్డి
మక్తల్ రూరల్, జనవరి 3 : రైతులు వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించడానికి మార్కెట్లో లభించే రకరకాల రసాయన మందులు ఉపయోగించి సాగు చేస్తున్నారు. అదేవిధంగా నాసిరకం ఎరువులు, మందులతో పండించిన ధాన్యం, కూరగాయలు తిని అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో మక్తల్ మండలం గుర్లపల్లిలో రైతు పాపిరెడ్డి తన మూడెకరాల పొలంలో గోఆధారిత వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. ప్రయోగాత్మకంగా గోఆధారిత సేంద్రి య ఎరువులతో కూరగాయలు, పూలతోట సాగు చేశారు. ఆ తర్వాత దిగుబడి ఎక్కువగా రావడం తో బీర, కాకర, సోరకాయ, వంకాయ, దోస, టమాట, పచ్చిమిర్చి, పాలకూర, తోటకూర, కొత్తిమీర, మెంతికూర తదితర కూరగాయలను సాగుచేశారు. కూరగాయలకు ఫెస్టిసైడ్ మందులను ఉపయోగించకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. సేంద్రియ ఎరువుల ప్రాధాన్యత పెరుగుతున్నందున తానే స్వయంగా గోఆధారిత ఎరువులను తయారు చేసి పంటలకు ఉపయోగిస్తున్నారు. గోవుల మూత్రం, పేడతో ఎరువులను తయారు చేసుకుని పంటకు వేస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా, జపాన్, రష్యా తదితర అగ్రదేశాల్లో కూడా గోఆధారిత సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించవచ్చని నిరూపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
తయారీ విధానం ఇలా..
గోమూత్రంతో పురుగుల మందు
గోమూత్రం, పొగాకు, వేపాకు, పచ్చిమిర్చితో పురుగుల మందును తయారు చేసుకోవాలి. ఆవు మూత్రం 20లీటర్లు, ఎల్లిపాయలు రెండు కిలోలు, పొగాకు రెండు కిలోలు, వేపాకు రెండు కిలోలు, పచ్చిమిర్చి రెండు కిలోల చొప్పున తీసుకుని గంటన్నర పాటు నీటిలో ఉడకబెట్టాలి. రెండురోజుల తర్వాత వాటి ద్వారా తీసిన రసాన్ని 15లీటర్ల నీటికిగానూ 250గ్రాముల రసాన్ని కలుపుకొని పంటలపై పిచికారీ చేయాలి. దీంతో పంటకు సోకిన తెగుళ్లు నివారించుకోచ్చు. దీన్ని ఆగ్జాస్రం అని అంటారు.
ఆవు పేడ, గోమూత్రం, బెల్లంతో..
ఆవుపేడ, గోమూత్రంతో ఎరువులు తయారు చేసుకోవడానికి ఆవుపేడ 20కిలోలు, గోమూత్రం 20లీటర్లు, బెల్లం కిలో తీసుకోవాలి. వీటిని మూడు రోజులపాటు నీళ్లలో కలిపి ఉంచాలి. తర్వాత ఒక గుడ్డలో ఒడగట్టి రసాన్ని డ్రిప్ ఇరిగేషన్ పైపుల ద్వారా మొక్కలకు వేయాలి. దీంతో భూమి సారంవంతమవుతుంది. మొక్కలకు గ్రోత్ వస్తుంది. భూమిలో ఎర్రెలు తయారై అధిక దిగుబడికి తోడ్పడుతుంది.
గోఆధారిత పంటలతో ఆరోగ్యం
గోఆధారిత ఎరువులతో పండించిన ధాన్యం, కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటారు. మార్కెట్లో ప్రస్తుతం రసాయనిక ఎరువుల ద్వారా పంటలతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. గోఆధారిత వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలి. ప్రభుత్వం రైతులను ప్రోత్సహించి సేంద్రియ ఎరువుల తయారీపై అవగాహన కల్పించాలి. కల్తిలేని ఆహారం అందించినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. భవిష్యత్‌లో వరి, పప్పు దినుసులు, ఆకుకూరలు తదితర పంటలను పండించడానికి కృషి చేస్తా.
- పాపిరెడ్డి, రైతు, గుర్లపల్లి, మక్తల్
తాజావార్తలు
- మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు
- దేశీ వ్యాక్సిన్ : బీజేపీ ఆరోపణలు తోసిపుచ్చిన పంజాబ్ సీఎం
- ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. పరిటాల శ్రీరామ్‌పై కేసు
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- భారతీయులపై నేపాల్ పోలీసులు కాల్పులు.. ఒకరు మృతి
- శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన ఇద్దరికి యూకే స్ట్రెయిన్
- తాత అదుర్స్.. వందేళ్ల వయసులోనూ పని మీదే ధ్యాస
- బెంగాల్ పోరు : కస్టమర్లను ఊరిస్తున్న ఎన్నికల స్వీట్లు
- రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం..కడవరకు పోరాడుతాం