ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Jan 03, 2021 , 00:39:44

సమన్వయంతో కొనసాగాలి

సమన్వయంతో కొనసాగాలి

నారాయణపేట, జనవరి 2 : కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు ప్రాసిక్యూటర్లు, కోర్టు సిబ్బందితో మంచి సమన్వయాన్ని కొనసాగించాలని ఎస్‌హెచ్‌వోలు ఆదేశించారు. శనివారం జిల్లాలోని ఆయా పోలీస్‌స్టేషన్‌ల్లో కోర్టు డ్యూ టీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలోని కేసులు, శిక్షలు, వీగిపోయిన కేసుల లోపాలను చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టు డ్యూటీ అధికారులు సమర్థవంతంగా వ్యవహరిస్తూ నిందితులకు సరైన రీతిలో శిక్ష పడేలా చేసి సకాలంలో బాధితులకు న్యాయం చేయాలన్నారు. కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌, విచారణలో సమర్థవంగా ఇన్వెస్టిగేషన్‌, ప్రాసిక్యూషన్‌ చేయాలన్నారు. కోర్టుల్లోని వివిధ అధికారులను సమన్వయపరుస్తూ సాక్షులు, నిందితులను కోర్టులో హాజరు పరచాలన్నారు. పోలీ స్‌ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం, గౌరవం పెరుగడానికి తమవంతు పాత్రను పోషించాలని సూచించారు. కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటించి, సకాలంలో ఉన్నతాధికారులకు చేరవేయాలన్నారు. 


VIDEOS

logo