మరింత మెరుగైన సేవలు అందించాలి

- ఎస్పీ డాక్టర్ చేతన
నారాయణపేట, జనవరి 1: నూతన ఏడాదిలో పోలీసులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ డాక్టర్ చేతన అన్నారు. పట్టణంలోని ఎ స్పీ కార్యాలయంలో నూతన ఏడాది వే డుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నూతన ఏడాదిలో నేర రహిత, ప్రమాదాల నివారణ, మహిళలకు భద్ర త, పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు లక్ష్యంగా సేవలందిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ ఎప్పు డు ప్రజల సేవలో ఉంటుందన్నారు.
పోలీస్‌స్టేషన్‌కు వస్తే కచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించేలా అధికారులు పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ భరత్, డీఎస్పీ మధుసూదన్‌రావు, సీఐలు శ్రీకాంత్‌రెడ్డి, శంకర్, శివకుమార్, రాంలాల్, ఆర్ ఐ కృష్ణయ్య, ఆర్ఎస్ఐ నరసింహ, ఎస్సైలు, పో లీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అభినందనలు...
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు 2020ను పురస్కరించుకొని ప్రభుత్వం వివిధ స్థాయిలో పోలీసులు అందించిన సేవలకు గుర్తింపుగా గురువారం పురస్కారాలు ప్రకటించింది. జిల్లా నుంచి ఈ పురస్కారాలకు ఎంపికైన ఏఎస్సైలు ఎల్లయ్య, తుల్జా రాం, ఏఆర్‌హెచ్‌సీ అయ్యప్ప, నర్సిరెడ్డిలను ఎస్పీ అభినందించారు.
ఆపరేషన్ స్మైల్ 7 వాల్‌పోస్టర్ విడుదల
18 ఏండ్ల లోపు ఉండి తప్పిపోయిన, వదిలి వేయబడిన పిల్లలు, బాలకార్మికులుగా పని చేస్తు న్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, చిల్డ్రన్స్ వెల్ఫేర్ సొసైటీకి పంపి స్తామని ఎస్పీ చేతన అన్నారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ చేతన ఆపరేషన్ స్మైల్ 7 వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాలలతో ఎవరైనా భిక్షాటన, వెట్టిచాకిరి చేయించినా, కర్మాగారాల్లో పని చేయించినా అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకునేలా ఆపరేషన్ స్మైల్ 7 టీంని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు బాలకార్మికులుగా ఎవరైనా ఉన్నట్లు తెలిస్తే 100కు సమాచా రం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు వెంకటేశ్వర్లు, శివ, నాగేశ్వర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆ నినాదాలు వింటే చైనాకు ఒళ్లుమంట: ప్రధాని
- ఫుడ్ కార్పొరేషన్లో ఏజీఎం పోస్టులు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్‌పై ఆంక్షలు!
- ఆ గవర్నర్ నన్ను కూడా లైంగికంగా వేధించారు!
- హైదరాబాద్‌లో నడిరోడ్డుపై నాగుపాము కలకలం..!
- ట్విట్టర్ సీఈఓపై కంగనా ఆసక్తికర ట్వీట్
- కేంద్రం ఐటీఐఆర్‌ను రద్దు చేయకపోయుంటే..