గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 01, 2021 , 03:38:05

గిరిజన బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలి

గిరిజన బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలి

నారాయణపేట టౌన్‌, డిసెంబర్‌ 31 : బెస్ట్‌ అవైలెబుల్‌ పాఠశాలల్లో 2021-22కి గానూ 3, 5, 8 తరగతుల్లో ప్రవేశాల కోసం నారాయణపేట జిల్లాకు చెందిన గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ హరిచందన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతా ల వారీగా వార్షిక ఆదాయం రూ. లక్షా 50 వేలు, పట్టణ ప్రాంతాల వారీగా వార్షిక ఆదాయం రూ.2లక్షలు మించరాదన్నారు. దరఖాస్తు ఫారాలు నేటి నుంచి 8వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మహబూబ్‌నగర్‌ వారి కార్యాలయంలో ఉచితంగా లభిస్తాయని, పూర్తి చేసిన ఫారాలను అదే తేదీ సాయంత్రం 5గంటల లోగా కార్యాలయంలో సమర్పించాలన్నారు.

16న లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. నారాయణపేట జిల్లాకు మొత్తం 5 సీట్లను కేటయించామని, 3వ తరగతిలో లంబాడా బాలికలకు 1, జనరల్‌ 1, ఎరుకల 1 కేటాయించారని, 5వ తరగతిలో లంబాడా జనరల్‌ 1, 8వ తరగతిలో లంబాడా జనరల్‌ 1 సీట్లను కేటాయించామన్నారు. ఈ అవకాశాన్ని గిరిజన బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. 


VIDEOS

logo