శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Dec 31, 2020 , 00:04:51

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని అమలు చేయాలి

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని అమలు చేయాలి

  • పోలీస్‌ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ చేతన

నారాయణపేట: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని అమలుచేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చాలని ఎస్పీ చేతన సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని అమలుచేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చాలని ఎస్పీ చేతన సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం సబ్‌ డివిజినల్‌ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేసి పలు సూచనలు అందించారు. గ్రేవ్‌ క్రైమ్స్‌, ఎస్సీ, ఎస్టీ కేసుల గురించి, సిబ్బంది సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలన, వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావం కలిగి ఉండాలన్నారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటూ, మాట్లాడటంలో నైపుణ్యం, బాధ్యతలను నిర్వర్తించడంలో నిజాయితీ, పారదర్శకత కలిగి ఉండాలన్నారు. డీఎస్పీ మధుసూదన్‌రావు, సీఐ శ్రీకాంత్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

జాతర ఏర్పాట్లు పరిశీలన

  మక్తల్‌ టౌన్‌: మక్తల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ చేతన తెలిపారు. బుధవారం మక్తల్‌ పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ చేతన తనిఖీ చేశారు.  స్టేషన్‌లో ఫైల్స్‌ పరిశీలించి పెండింగ్‌ కేసులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఎవరి పరిధిలో  వారు నిత్యం విధులను  నిర్వర్తించాలని, డయల్‌ 100కు ఫోన్‌ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించాలని, పెట్రోల్‌ కార్‌ నిరంతరం గస్తీ నిర్వహించాలని, ఏమైనా సమస్యలు ఉంటే తనదృష్టికి తీసుకురావాలని తెలిపారు. అధికారులు సిబ్బంది క్రమశిక్షణ , సమయపాలన, వృత్తిపట్ల నిబద్ధత, విధేయత కలిగి ఉండాలని సూచించారు. అదేవిదంగా మక్తల్‌ పడమటి ఆంజనేయస్వామి జాతర సందర్భంగా ఏర్పాట్లను ఆలయ ఈవోతో కలిసి పరిశీలించారు.  కార్యక్రమంలో సీఐ శంకర్‌, ఎస్సై రాములు పాల్గొన్నారు.


VIDEOS

logo