సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Dec 31, 2020 , 00:04:49

టీఆర్‌ఎస్‌ పాలనలోనే అభివృద్ధి

టీఆర్‌ఎస్‌ పాలనలోనే అభివృద్ధి

  • ఎమ్మెల్యే చిట్టెం    
  • రూ.3.37  కోట్లతో  చెక్‌డ్యాం  నిర్మాణానికి  భూమి పూజ

ఊట్కూర్‌ : దేశంలో ఎక్కడాలేని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఓబ్లాపూర్‌ శివారులోని నక్కలకుంట వాగులో రూ. 3. 37 కోట్లతో నిర్మించ తలపెట్టిన చెక్‌డ్యాం పనులను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చెక్‌డ్యాం పనులు పూర్తయితే భూగర్భ జలాలు పెరిగి రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. దాదాపు రెండు వేల ఎకరాల్లో రైతులు ఆశించిన పంటలు పండించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. మక్తల్‌ నియోజకవర్గానికి ఎనిమిది చెక్‌డ్యాంలు మంజూరు చేయించామని చెప్పారు. వానకాలం వరకు చెక్‌డ్యాం పనులను పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తే ఎంతటి వారినైనా సహించబోమని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎమ్మెల్యే సహకారంతో వచ్చే వానకాలం నాటికి పనులు పూర్తిచేసి చెక్‌డ్యాంను వినియోగంలోకి తెస్తామని ఎమ్మెస్సార్‌ ప్రాజెక్టు కన్‌స్ట్రక్షన్‌ కాంట్రాక్టర్‌ నర్సింహారెడ్డి పే ర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమం లో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్‌, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ బాల్‌రెడ్డి, సర్పంచులు సూర్యప్రకాశ్‌రెడ్డి, శంకరమ్మ, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్‌, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ఇరిగేషన్‌ ఈఈ రవీందర్‌, డీఈ కేతన్‌కుమార్‌, ఏఈ వెంకటప్ప, మండల కో ఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌ రహ్మాన్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి,  ఉప సర్పంచ్‌ ఇబాదుల్‌ రహ్మాన్‌ పాల్గొన్నారు. 

VIDEOS

logo