శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Dec 30, 2020 , 00:40:54

కారు ద్విచక్రవాహనం ఢీ : యువతి మృతి

కారు ద్విచక్రవాహనం ఢీ : యువతి మృతి

నారాయణపేట రూరల్‌ : మండలంలోని చిన్నజట్రంలో మంగళవారం కారు ద్విచక్రవాహనం ఢీ కొని ఓ యువతి మృతి చెందిన సంఘటన చోటుచేసుకున్నది. పోలీసులు కథనం ప్రకారం... కొల్లంపల్లి గ్రామానికి చెందిన అ న్నాచెల్లెలు వెంకటేశ్‌, వెంకటమ్మ జాతర కోసం దుస్తులు కొనుగోలు చేయడానికి నారాయణపేటకు వెళ్లి తిరిగి స్వ గ్రామానికి వస్తున్న క్రమంలో చిన్నజట్రంలో కారు ద్విచక్రవాహనం ఢీ కొన్నాయి. ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న వెంకటమ్మ(18) మృతి చెందగా వెంకటేశ్‌కు తీవ్ర గాయాలైయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి ఎస్సై చంద్రమోహన్‌ చేరుకుని మృతదేహాన్ని పేట దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్‌ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో పేట జిల్లా దవాఖానకు తరలించారు.  ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

VIDEOS

logo