శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Dec 30, 2020 , 00:40:52

‘గిరి వికాసం’ సద్వినియోగం చేసుకోవాలి

‘గిరి వికాసం’ సద్వినియోగం చేసుకోవాలి

నారాయణపేట : జిల్లాలోని గిరిజన రైతులు ‘గిరి వికాసం’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ హరిచందన కోరారు. మంగళవారం కలెక్టరేట్‌ చాంబర్‌లో ‘గిరి వికాసం’ పథకంపై కలెక్టర్‌ హరిచందన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ పథకంలో గిరిజన రైతులు పొలాల్లో బోరు వేసుకోవడానికి అలాగే మోటర్‌ పంపు సెట్‌ బిగించుకోవడానికి, కరెంట్‌ కనెక్షన్‌ వంటి మూడు సదుపాయాలను వంద శాతం సబ్సిడీతో ఇవ్వ డం ఇవ్వనుట్లు తెలిపారు. నారాయణపేట జిల్లాకు కేటాయించిన టార్గెట్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. జిల్లాలోని గిరిజన రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా అధికారులు వంద శాతం టార్గెట్‌ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, డీటీడీవో శ్రీనివాస్‌, ఆర్డీవో శ్రీనివాస్‌, డీఆర్డీవో కాళిందిని, వ్యవసాయ అధికారి జాన్‌ సుధాకర్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo