శనివారం 06 మార్చి 2021
Narayanpet - Dec 29, 2020 , 03:28:36

రైతన్న అభ్యున్నతే సీఎం లక్ష్యం

రైతన్న అభ్యున్నతే సీఎం లక్ష్యం

  • రూ.700 కోట్లతో రైతువేదికల నిర్మాణం
  • వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
  • ధన్వాడలో రైతువేదిక, గోదాం ప్రారంభం
  • హాజరైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె, ఎమ్మెల్యేలు 

ధన్వాడ : రైతుల అభ్యున్నతే ధ్యేయం గా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అ న్నారు. సోమవారం ధన్వాడలో రైతువేది క, నూతన గోదాం భవనాలను మంత్రి శ్రీ నివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎ మ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రా రంభించారు. ఈ సందర్భంగా మంత్రి సిం గిరెడ్డి మాట్లాడుతూ

 రాష్ట్రంలో రూ.700 కోట్లతో 2,600 రైతు వేదికలను నిర్మిస్తున్నామన్నారు. 25 లక్షల టన్నుల ధాన్యం నిలువ చేసేలా, రైతులు పంటను నిలువ చే సుకుని ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకునే సౌ లభ్యం కోసం గోదాంల నిర్మాణం చేపట్టామన్నారు. 40 లక్షల మెట్రిక్‌ టన్నుల నిలు వ సామర్థ్యం కలిగిన గోదాం, కోల్డ్‌ స్టోరేజ్‌ ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు మంత్రులకు కలెక్టర్‌ హరిచందన పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. మంత్రులను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

 అలాగే ఐకేపీ ద్వారా రైతుల కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌, వ్యవసాయ పనిముట్లను ప్రారంభించారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ సురేఖ, జెడ్పీటీసీ విమల, ఎంపీపీ పద్మిబాయి, ఎంపీటీసీ మాధవి, రైతు సంఘం అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo