సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Dec 28, 2020 , 09:44:30

ప్రతిఒక్కరూ భగవంతుడిని స్మరించుకోవాలి

ప్రతిఒక్కరూ భగవంతుడిని స్మరించుకోవాలి

నారాయణపేట టౌన్‌ : ప్రతిఒక్కరూ భగవంతుడిని స్మరించుకోవాలని అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి జిల్లా అధ్యక్షుడు కాకర్ల భీమ య్య అన్నారు. ఆదివారం పట్టణంలోని సింగార్‌బేస్‌లో అయ్యప్ప మాలధారుడు, గాయకుడు రాముగౌడ్‌ను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయకుడు రాముగౌడ్‌ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ర్టాల్లో పడిపూజలో పాల్గొంటూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అయ్యప్ప పాటలను ఆలపిస్తున్నాడని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ బాలు ఫ్యాన్స్‌ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు, గాయకులు మ హిపాల్‌రెడ్డి, శబరి పీఠం సన్నిధానం అధ్యక్షుడు వెంకటేశ్‌, తిప్పన్న, గురుస్వాములు రాజశేఖర్‌, కన్నయ్య, అంజి, సచిన్‌, భరత్‌ పాల్గొన్నారు. 

VIDEOS

logo