ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Narayanpet - Dec 28, 2020 , 09:37:38

మంచీ చెడులు తెలుసుకోవాలి

మంచీ చెడులు తెలుసుకోవాలి

నారాయణపేట : విద్యార్థులు సమాజంలోని మంచీ చెడులు, న్యాయం, అన్యాయాలను ప్రతి క్షణం గమనిస్తూ, న్యాయం, మంచి వైపు నిలబడాలని పీవైఎల్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు హన్మేశ్‌ తెలిపారు. పట్టణంలోని పీడీఎస్‌యూ కార్యాలయంలో జిల్లా పీడీఎస్‌యూ రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేడు పాలకవర్గాలు విద్యార్థులను మంచి వైపు ఆ లోచించనీయడం లేదన్నారు. నిత్యం విద్యార్థులు, యువత మెదడును అస త్య ప్రచారాలతో నింపేస్తున్నాయన్నారు. విద్యార్థులు, యువత అన్యాయాల గురించి ప్రశ్నించకుండా ఉండడమే వారికి కావాలన్నారు. ఈ విధానాల వల్ల మెజార్టీ ప్రజానికానికి అన్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాము, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ, జి ల్లా అధ్యక్షుడు సాయికుమార్‌, కార్యదర్శి అజయ్‌, ఉపాధ్యక్షులు, కార్యదర్శు లు, కోశాధికారి గౌస్‌, విద్యార్థి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

VIDEOS

logo