శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Dec 28, 2020 , 09:37:38

‘రైతులపై కేంద్రం కపట ప్రేమ’

‘రైతులపై కేంద్రం కపట ప్రేమ’

నారాయణపేట టౌన్‌ : రైతుల సమస్యలపై సానుకూల చర్చలు జరుపకుండా కాలయాపన చేసే విధంగా వ్యవహరించడాన్ని చూస్తే రైతులపై వారి కున్న కపట ప్రేమ బహిర్గతమవుతుందని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి అన్నారు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ పిలుపులో భాగంగా పట్టణంలోని మున్సిపల్‌ పార్కు వద్ద చేపడుతున్న రిలే దీక్షలు ఆదివారం 13 వ రోజూకు చేరాయి. ఈ దీక్షలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ దేశంలో రై తుల పోరాటానికి మద్దతు పెరుగుతుందన్నారు. ఈ నెల 29న జరిగే చర్యల్లో ఏఐకేఎస్‌సీసీ ఎజెండాలో పొందుపరిచిన అంశాలపై సానుకూల నిర్ణయం తీ సుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్రాములు, సహాయ కార్యదర్శి ప్రశాంత్‌, కోశాధికారి కొండా నర్సింహులు, మండల అధ్యక్ష, కార్యదర్శులు, పీవైఎల్‌ నాయకులు ఉన్నారు. 

VIDEOS

logo