బుధవారం 03 మార్చి 2021
Narayanpet - Dec 26, 2020 , 00:49:11

భక్తిశ్రద్ధలతో క్రిస్మస్‌

భక్తిశ్రద్ధలతో క్రిస్మస్‌

జడ్చర్ల టౌన్‌ : యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా శుక్రవారం క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో క్రిస్మస్‌ పండుగను జరుపుకొన్నారు. జడ్చర్లలోని సెంటినరి ఎంబీ చర్చి, ఐపీసీ చర్చి, ఉసన్న చర్చి, యేసుకృపా ప్రార్థనామందిరం, స్విహాన్‌ ప్రార్థ న మందిరం, పెంటకొస్టన్‌ చర్చి, యేసుక్రీస్తురాజు ఆల యం చర్చీల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బేతని ఎంబీ చర్చిలో ముఖ్య సందేశకుడు రెవ కేజే ప్రేమవర్దన్‌ యే సుక్రీస్తునుద్దేశించి సందేశం ఇచ్చారు. కాగా, క్రిస్టియన్‌ నా యకుల ఇండ్లల్లో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. 

యేసుప్రభు సూక్తులు అనుసరించాలి

భూత్పూర్‌ : యేసుప్రభు సూక్తులను ప్రతిఒక్కరూ అనుసరించాలని మున్సిపల్‌ చైర్మన్‌ బస్వరాజ్‌గౌడ్‌ అన్నారు. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక బ్లెస్సింగ్‌ చర్చిలో కేక్‌ కట్‌ చేశారు. అనంతరం క్రైస్తవులకు దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ నారాయణగౌడ్‌, పాస్టర్‌ రవివర్మ పాల్గొన్నారు.

సన్మార్గంలో పయనిద్దాం

బాలానగర్‌ : ధర్మ సంరక్షణకు యేసుక్రీస్తు చూపిన స న్మార్గంలో పయనిద్దామని జడ్పీటీసీ కల్యాణి అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్యానాయక్‌, వైస్‌ ఎంపీపీ వెంకటాచారి, స ర్పంచ్‌ విజయలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు. 

పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు 

మహబూబ్‌నగర్‌ టౌన్‌ : పండుగలు మత సామరస్యానికి ప్రతీకలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రచార కార్యదర్శి సీజె బెనహర్‌ నివాసంలో క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి ఎన్పీ వెంకటేశ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ముత్వాల ప్రకాశ్‌, నాయకు లు, క్రిస్టియన్లు పాల్గొన్నారు.

దేవరకద్ర మండలంలో..

దేవరకద్ర రూరల్‌ : మండల కేంద్రంతోపాటు కౌకుంట్ల గ్రామంలో క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కౌకుంట్ల చ ర్చిలో నిర్వహించిన వేడుకల్లో సర్పంచ్‌ స్వప్నకిషన్‌రావు, ఎంపీటీసీ కిష్టన్న పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. 

నవాబ్‌పేట మండలంలో..

నవాబ్‌పేట : మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామా ల్లో క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. నవాబ్‌పేట, తీగల్‌పల్లి, మల్లారెడ్డిపల్లి, చౌడూర్‌ గ్రామాల్లోని చర్చీ ల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో డేవి డ్‌, కాంతమ్మ, దావీదు, వెంకటయ్య, యాదయ్య ఉన్నారు. 

మిడ్జిల్‌ మండలంలో..

మిడ్జిల్‌ : మండల కేంద్రంతోపాటు వాడ్యాల, రెడ్డిగూడ, మున్ననూర్‌, చిల్వేర్‌, దోనూర్‌, కొత్తూర్‌ గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో తెల్లవారుజాము నుంచి క్రైస్తవులు పాటలు పాడుతూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం చర్చీల్లో ప్రత్యేక ప్రార్థన లు చేశారు. 

మరికల్‌ మండలంలో..

మరికల్‌ : క్రిస్మస్‌ వేడుకలు మండలం కేంద్రంలో ఘనం గా నిర్వహించారు. ఉదయం నుంచి పలు చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండల కేంద్రంలోని గ్రేస్‌ చర్చి, బెతేలు చర్చి, జిన్నారం, ఇబ్రాహీంపట్నం, తీలేరు గ్రామాల్లోని చ ర్చీల్లో పాస్టర్లు ప్రార్థనలు నిర్వహించి క్రీస్తు గుర్చి భక్తులకు వివరించారు. కార్యక్రమంలో క్రిస్టియన్లు పాల్గొన్నారు.

ఊట్కూర్‌ మండలంలో..

ఊట్కూర్‌ : మండల కేంద్రంతోపాటు కొల్లూరు, పెద్దపొర్ల, బిజ్వారం గ్రామాల్లో క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని క్రీస్తు జన్మదిన వేడులకు క్రిస్టియన్‌ సోదరులు ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో క్రిస్టియన్లు కొత్త బట్టలు ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు డేవిడ్‌, జనార్దన్‌, బాల్‌రామ్‌ క్రీస్తు జన్మదిన ప్రాముఖ్యతను వివరించారు. పలువురు అనాథలకు దుస్తుల పంపిణీ చేశారు. కేక్‌ను కట్‌ చేసి పంచి పెట్టారు. వివిధ చర్చీల వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ అరవింద్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీనివాసులు, ఉపసర్పంచ్‌ ఇబాదుల్‌ రహిమాన్‌, జేవీవీపీఎస్‌ జిల్లా కన్వీనర్‌ హాజమ్మ, వార్డు సభ్యుడు అశోక్‌ పాల్గొని పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

కృష్ణ మండలంలో..

కృష్ణ : మండలంలోని తంగిడిగి, వా సునగర్‌ గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమస్త ప్రాణులపై అంతులేని ప్రేమను చూపిన కరు ణామయ్యాడని పేర్కొన్నారు. ఆయన మార్గంలో నడువడంతోపాటు తోటి ప్రజలకు కూడా కరుణా పంచాలన్నారు. కేక్‌ కటింగ్‌, క్యాండిల్‌ సర్వీస్‌, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 

పట్టణంలో..

నారాయణపేట టౌన్‌ : పట్టణంలో క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకొన్నారు. చర్చీలను విద్యుదీపాలతో అలంకరించడంతోపాటు ఇండ్లల్లో, చర్చీల్లో క్రిస్మస్‌ ట్రీలను ఏర్పాటు చేసుకున్నారు. బాపునగర్‌లోని ఎబినెజర్‌ చర్చిలో పాస్టర్‌ జాన్‌, అశోక్‌నగర్‌లోని హెబ్రాన్‌ చర్చి, పళ్ళలోని ఎంబీ చర్చి పాస్టర్లు క్రీస్తు పుట్టుక, ప్రాముఖ్యతల గు రించి వివరించారు. మహిళలు క్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక పాటలు పాడగా, చిన్నారులు క్రిస్మస్‌ పాటలకు నృత్యాలు చేశారు. ఆయా చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

కోస్గి మండలంలో..

కోస్గి : క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని సాయినగర్‌ కాలనీలో క్రైస్తవ సోదరులు పండుగ సం బురాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్‌ కట్‌ చేసి సంబురాలు జరుపుకొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్యహించారు. 

పేదలకు చీరెల పంపిణీ

మక్తల్‌ రూరల్‌ : మండలం కర్నిలో ఎంబీ చర్చిలో క్రిస్మ స్‌ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ప్రార్థనలు చే శారు. పేదలకు చీరెలను అందజేశారు. కార్యక్రమంలో పాస్టర్‌ ప్రసాద్‌, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. 

ఎల్లమ్మకుంటలో ..

మక్తల్‌ టౌన్‌ : భూ లోకంలో ప్రజలను రక్షించడానికి భూమిపై యేసు ప్రభువు జన్మించాడని పాస్టర్లు జాన్సన్‌, శ్యామ్యూల్స్‌ అన్నారు. పట్టణంలోని ఎల్లమ్మకుంటలో బిలివర్స్‌ ఈస్టర్న్‌ చర్చిలో పాస్టర్‌ శ్యామ్యూల్‌, జీసస్‌ క్రిస్ట్‌ ఫెల్లోషిప్‌ చర్చి పాస్టర్‌ జాన్సన్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అనంతరం ప్రార్థనలు చేశారు. తదనంతరం పాస్టర్స్‌ పిల్లలతో కలిసి కేక్‌కట్‌ చేసి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో క్రిస్టియన్లు పాల్గొన్నారు.

VIDEOS

logo