శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Dec 26, 2020 , 00:48:46

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

నారాయణపేట టౌన్‌ : నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో నిర్మాణ రంగ వృత్తుల్లో నైపుణ్యం కోసం అర్హులైన పెయింటర్స్‌కు 15 రో జులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు కార్మిక శాఖ అధికారి రాజ్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణలో పెయింటర్స్‌కు రోజుకు రూ.3 00 రెమ్యూనురేషన్‌ ఇవ్వడంతోపాటు మధ్యాహ్నం భోజన వసతి ఉం టుందన్నారు. భవన, ఇతర నిర్మాణ కార్మిక చట్టం గుర్తింపు కార్డు కలిగి ఉండడంతోపాటు 18 నుంచి 45 ఏండ్ల లోపు వయస్సు ఉన్నవారు ఈ శిక్షణకు అర్హులన్నారు. శిక్షణ పొందాలనుకునే వారు కార్మిక శాఖ జారీ చేసి న గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం జిరాక్స్‌, రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలతో దరఖాస్తుకు జత చేసి పట్టణంలోని కార్మిక శాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు. 


VIDEOS

logo