మంగళవారం 02 మార్చి 2021
Narayanpet - Dec 25, 2020 , 01:12:23

దర్యాప్తు సమగ్రంగా జరిగేలా సహకరించాలి

దర్యాప్తు సమగ్రంగా జరిగేలా సహకరించాలి

నారాయణపేట : అధికారుల సూచనల ప్రకా రం వచ్చిన సిబ్బందిని ప్రణాళికాబద్ధంగా సమన్వ యం చేస్తూ వారి విధులపై స్పష్టత పెంచుతూ ద ర్యాప్తు సరైన రీతిలో సమగ్రంగా జరిగేలా చూడాలని స్టేషన్‌ రైటర్స్‌ వర్టికల్‌ ఇన్‌చార్జి సీఐ శంకర్‌ అ న్నారు. గురువారం జిల్లాలోని స్టేషన్‌ రైటర్స్‌కు వీ డియో కాన్ఫరెన్స్‌తో ఒకరోజు శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌స్టేష న్‌లోని రికార్డులను ఏ రోజుకారోజు నిర్వహించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో 5ఎస్‌ విధానం అమలు లో ముఖ్య పాత్ర పోషించాలన్నారు. పరిసరాలు, రికార్డులు, సర్క్యులర్లను నిర్దేశిత ప్రదేశంలో సులభంగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎస్‌హెచ్‌వోల ఆదేశాల మేరకు బందోబస్తు స్కీము లు, డ్యూటీ పాస్‌పోర్టులు తయారు చేయాలన్నా రు. అవసరమైన సమాచారాలు, నివేదికలు సకాలంలో సమగ్రంగా పోలీస్‌ వ్యవస్థ, ఇతర వ్యవస్థలలోని అధికారులకు పంపుతూ అవసరమైన చ ర్యలు తీసుకోవాలన్నారు. 


VIDEOS

logo