శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Dec 23, 2020 , 04:06:20

ఇసుక అక్రమ డంప్‌లపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

ఇసుక అక్రమ డంప్‌లపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

మక్తల్‌ రూరల్‌ : మక్తల్‌, మాగనూర్‌ మండలాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక అక్రమ దందాపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు మక్తల్‌ ఎస్సై రాములు తెలిపారు. అలాగే మాగనూర్‌ మండలం వర్కూర్‌ గ్రామ శివారులో దాదాపు 100 టిప్పర్ల ఇసుక డంప్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం... మక్తల్‌ పో లీస్‌స్టేషన్‌ పరిధిలో నర్వ మండలం యాంకీ గ్రామానికి చెం దిన కురుమూర్తి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న సమయంలో మక్తల్‌ పట్టణంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించా రు. ఈ మేరకు టీఎస్‌ 08యూజీ 0337 నంబర్‌ లారీ ఇ సుక లోడ్‌తో వెళ్తుండగా పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై రాములుకు అప్పగించారు. ఈ సంఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై రాములు తెలిపారు. 

మాగనూర్‌లో 100 టిప్పర్ల ఇసుక డంప్‌ సీజ్‌

మాగనూర్‌ మండలంలో ఇసుక అక్రమ డంప్‌ల నిల్వలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ సంఘటనలో వర్కూర్‌ గ్రామ శివారులో ఒక ప్రై వేట్‌ స్థలంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంప్‌ను పోలీసులు గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా మాగనూర్‌ పెద్ద వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిం చి నిల్వ చేసినట్లు పోలీసులు తెలిపారు. డంప్‌ చేసిన ఇసుక దాదాపు 100 టిప్పర్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. డంప్‌ను సీజ్‌ చేసి మాగనూర్‌ తాసిల్దార్‌కు స్వాధీనం చేసినట్లు ఎస్సై శివనాగేశ్వరరావు తెలిపారు. 

VIDEOS

logo