బుధవారం 03 మార్చి 2021
Narayanpet - Dec 22, 2020 , 01:28:25

‘రద్దు చేయడమే పరిష్కారం’

‘రద్దు చేయడమే పరిష్కారం’

నారాయణపేట : వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే పరిష్కారం అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్‌ అన్నా రు. పట్టణంలోని రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు 7వ రోజూ సోమవారం కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశానికి అన్నం పెట్టే రైతన్న కడుపు కొడుతూ కార్పొరేట్‌ శక్తులను బలోపేతం చేసేందుకు పూనుకున్నదని విమర్శించారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదప్ప, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రాం, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి నరసింహ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.VIDEOS

logo