సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Dec 20, 2020 , 01:03:55

ప్రేమ, దయ, దాన గుణాలే అన్ని మతాల ధర్మం

ప్రేమ, దయ, దాన గుణాలే  అన్ని మతాల ధర్మం

  •  క్రిస్మస్‌ కిట్ల పంపిణీలో  ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

నారాయణపేట : సమాజంలో ఒకరిపై ఒకరికి ప్రేమ, దయ, దాన గుణాలు ఉండాలని అన్ని మతాలు చెబుతున్నాయని ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి అన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎంబీ చర్చిలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై క్రిస్టియన్లకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ కలిసి, మెలిసి సోదరభావంతో ఉండాలని అన్ని గ్రంథాలు బోధిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారికి పండుగ సమయంలో కానుకలు ఇస్తున్నదని, ఇందులో భాగంగా క్రిస్టియన్లకు క్రిస్మస్‌ గిఫ్ట్‌లను అందిస్తున్నదని తెలిపారు. కరోనా మహమ్మారి తగ్గేలా పండుగ రోజు ప్రేయర్‌ చేయాలన్నారు.

కార్యక్రమంలో ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు మహేశ్‌, బండి రాజేశ్వరి, అనిత, శిరీష, వరలక్ష్మి, అమీరుద్దీన్‌, సీపీవో భూపాల్‌రెడ్డి, తాసిల్దార్‌ దానయ్య, డీటీ ప్రమీల, నాయకులు ఎస్‌.రాజవర్ధన్‌రెడ్డి, కోట్ల రాజవర్ధన్‌రెడ్డి, సరాఫ్‌ నాగరాజు, జగదీశ్‌, ప్రతాప్‌రెడ్డి, విజయ్‌సాగర్‌, చెన్నారెడ్డి, గురులింగం, రాజు, నర్సింహ, వెంకట్‌, పాస్టర్లు పాల్గొన్నారు.

VIDEOS

logo