ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Narayanpet - Dec 19, 2020 , 02:07:03

రైతాంగ ఉద్యమానికి మద్దతివ్వాలి

 రైతాంగ ఉద్యమానికి మద్దతివ్వాలి

నారాయణపేట: దేశ రైతాంగం దృఢసంకల్పంతో చేస్తున్న ఉద్యమానికి ప్రజలంతా మద్దతిచ్చి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్‌ పిలుపునిచ్చారు. అఖిలభారత రైతుపోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) పిలుపులో భాగంగా పట్టణంలోని మున్సిపల్‌ పార్క్‌ ఎదుట నాలుగో రోజు రిలే దీక్ష కొనసాగింది. ఈ దీక్షలను ఉద్దేశించి వారు మాట్లాడారు. దేశ రైతాంగానికి నష్టం కలిగించే మూడు చట్టాలను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టొద్దని, దాదాపు 250 రైతు సంఘాలు, వివిధ పార్టీలు, రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఆందోళన చేస్తే వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా కార్పొరేట్‌ ముద్దు.. రైతాంగం వద్దు అనే రీతిలో కేంద్రం పార్లమెంట్‌లో చట్టాలను ప్రవేశపెట్టిందన్నారు.

చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని, పంజాబ్‌, హర్యానా, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ర్టాల ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి ప్రశాంత్‌, రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ అంజయ్యగౌడ్‌, ఏఐకేఎంఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, హజీమల్లాంగ్‌, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి నర్సిములు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాలప్ప, అరుణోదయ జిల్లా నాయకులు అంజి, సీఐటీయూ జిల్లా నాయకులు జోషి తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo