సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Dec 18, 2020 , 01:09:33

మెరుగైన చికిత్స అందించాలి

మెరుగైన చికిత్స  అందించాలి

నారాయణపేట టౌన్‌ : క్షయ వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించి వారికి క్ర మం తప్పకుండా మెరుగైన చికిత్సలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జయచంద్రమోహన్‌ అన్నారు. గురువారం పట్టణంలోని వై ద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం అమలు తీరుపై ఎస్‌టీఎల్‌ఎస్‌, ఎస్‌టీఎస్‌, ఎన్‌టీఈపీ నోడల్‌ సూపర్‌వైజర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్ష య వ్యాధి గ్రస్తుడిగా నిర్ధారణ అయిన తర్వాత నెలకు రూ.500 వారి అకౌంట్‌లో జమ చేయాలని పేర్కొన్నారు. ఈ ఏడాది జిల్లాలో జనవరి నుంచి ఇప్ప టి వరకు మొత్తం 838 మందిని గుర్తించామన్నారు. కార్యక్రమంలో డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్‌(ఎన్‌టీఈపీ) డాక్టర్‌ మహేశ్‌, మాస్‌ మీడియా అధికారి హన్మంతు, సూపర్‌ వైజర్లు పాల్గొన్నారు. 


VIDEOS

logo