బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలి

- రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు దేవయ్య
నారాయణపేట టౌన్ : బాలకార్మికుల వ్యవస్థను రూపుమాపేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర బాలల హ క్కుల కమిషన్ సభ్యుడు దేవయ్య అరికెల సూచించారు. జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ వంటి కార్యక్రమాలను 365 రోజులపాటు నిర్వహించినట్లయితే ఈ వ్యవస్థను రూ పుమాపేందకు వీలు పడుతుందన్నారు. గురువారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరిచందన, ఎస్పీ చేతనతో కలిసి జిల్లా సంక్షేమ, అనుబంధ శాఖల అధికారులతో బాలల హక్కుల సంరక్షణ కోసం జిల్లాలో తీసుకుంటున్న చర్యలు, వివిధ కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు బాల్యంలో పొందవలసిన అన్ని హక్కులను వారికి అందే విధంగా చూడడమే కాకుండా, వారు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు మహిళ, శిశు సంక్షేమ శాఖతోపాటు చైల్డ్ హెల్ప్‌లైన్, పోలీస్, విద్య, వై ద్య, లేబర్, స్వచ్ఛంద సంస్థలు పని చేయాలని పేర్కొన్నా రు. మహిళలు, బాలబాలికల హక్కులు వాటి సంరక్షణ కో సం లైన్ డిపార్ట్మెంట్ అధికారులు బాధ్యతతోపాటు మానవతా హృదయంతో పని చేయాలని సూచించారు. బాల్య వివాహాలు అరికట్టేందుకు ముందస్తుగా గ్రామాల్లో ప్రజల కు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, బాల్య వివాహా లు జరిగితే కేసులు పెట్టడమే కాకుండా తల్లిదండ్రులు తిరిగి ఆ పొరపాట్లు చేయకుండా కౌన్సెలింగ్ ఇవ్వాలని చెప్పారు. ప్రతి గ్రామంలో బాలల హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నంబర్ 10 98, సఖి సెంటర్ నంబర్ 181, 100 నంబర్లను పెయింటింగ్ వేయించి ప్రచారం చేయాలన్నా రు. విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు, మండల చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీల సం ఖ్య, షీ టీమ్స్‌లను పెంచాలని, సైబర్ నేరాగాల ఆటలు కట్టించేందుకు చర్య లు తీసుకోవాలని ఆదేశించారు.
కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడడం, మహిళా సాధికారత, అమ్మాయిలు ఉన్నత చ దువులు చదివే విధంగా ప్రోత్సహించడం, తగిన అవకాశా లు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం పని చేస్తుందని వి వరించారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణా తరగతు లు నిర్వహించడంతో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చ ర్యలు తీసుకుంటున్నామన్నారు. పోషన్ అభియాన్ పథకం తో అంగన్వాడీ సెంటర్లు, పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు నెలకొల్పి పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో అవసరమైన మహిళలకు రాత్రి పూట షెల్టర్ కోసం నైట్ షెల్టర్‌ను ఏర్పాటు చేశామన్నారు.
ఎస్పీ చేతన మాట్లాడుతూ జిల్లాలో బాధితులకు సహా యం అందించేందుకు మోడల్ పోలీసింగ్ విధానాన్ని అనుసరిస్తున్నామన్నారు. మహిళలు, పిల్లల సమస్యలను గోప్యమైన అంశాలను తెలియజేసేందుకు అన్ని గ్రామాలు, పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేశామన్నారు. బా ల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, మూఢచారాలు, జోగిని వ్యవస్థను రూపుమాపేందుకు పోలీస్ శాఖ ద్వారా కళాజాత బృందాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆమె వివరించారు.
జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి జైపాల్‌రెడ్డి మాట్లాడు తూ బాలల హక్కుల పరిరక్షణకు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.జయచంద్రమోహన్, డీహెచ్‌ఎస్‌వో వెంకటేశ్వర్లు, డీఎస్పీ మధుసూదన్‌రావు, ఆర్డీవో శ్రీనివాసులు, చైల్డ్ లైన్ ప్రొటెక్షన్ అధికారులు, సీడీపీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- 06-03-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
- నిరుద్యోగుల కోసం మొబైల్ కెరీర్ కౌన్సెలింగ్ ల్యాబ్
- రాష్ట్రంలో మూడురోజులు పొడి వాతావరణం.. పెరగనున్న ఎండలు
- నాణ్యమైన పరిశోధనలు జరగాలి: ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి
- బండ చెరువు నాలా పనులను జీహెచ్ఎంసీకి అప్పగించాలి
- రాజకీయ దురుద్దేశంతోనే ర్యాంకింగ్‌ను తగ్గించారు
- వృద్ధులకు గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే టీకాలు వేయాలి
- బీజేపీ ద్వంద్వ విధానాల్ని ఎండగట్టాలి
- అభివృద్ధి కావాలా..? అబద్ధాలు కావాలా..?
- తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు..