ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Dec 16, 2020 , 03:13:12

అంబులెన్స్‌ డ్రైవర్‌కు సన్మానం

అంబులెన్స్‌ డ్రైవర్‌కు సన్మానం

నారాయణపేట : మరికల్‌ మండల కేంద్రంలో రెండేండ్ల కిందట అయ్య ప్ప సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌ను మంగళవారం జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు టి.ఆచారి ఘనంగా సన్మానించారు. ఈ సం దర్భంగా ఆచారి మాట్లాడుతూ అయ్యప్పను ఆదర్శంగా తీసుకొని యువత మరిన్ని అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని అన్నారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ రఘు ఇప్పటి వరకు 350 మందిని వివిధ దవాఖానల్లో చేర్పించి, వారికి సహకరించడంతో డ్రైవర్‌ను సన్మానించామన్నారు. ధన్వాడ ఎంపీటీసీ ఉమేశ్‌ కుమార్‌ గుప్తా, ఏబీవీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి అయ్యప్ప ఉన్నారు.

అంబేద్కర్‌ యువజన సంఘం కమిటీ 

మండలాధ్యక్షుడిగా శివకుమార్‌

నారాయణపేట : డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ యువజన సంఘం కమిటీ మ రికల్‌ మండలాధ్యక్షుడిగా మరికల్‌ ఉపసర్పంచ్‌ శివకుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మొబైల్‌ షాపులో కమి టీ సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కమిటీ మం డలాధ్యక్షుడిగా శివకుమార్‌, ఉపాధ్యక్షులుగా నర్సింహులు, కమల్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శులుగా చెన్నయ్య, రాజు, కోండెటి రాజు, బాలరాజు, కా ర్యదర్శులుగా రాఘవేందర్‌, ఆనంద్‌, నరేశ్‌, శ్రీను, మోహన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. 

VIDEOS

logo