శనివారం 06 మార్చి 2021
Narayanpet - Dec 16, 2020 , 02:55:17

పంచాయతీల సహకారం అవసరం

పంచాయతీల సహకారం అవసరం

ధన్వాడ : ప్రభుత్వ పాఠశాలలకు గ్రామ పంచాయతీల సహకారం అం దించి మౌలిక వసతులను సమకూర్చాలని డీఈవో రవీందర్‌ కోరారు. మంగళవారం ధన్వాడ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ‘చైల్డ్‌ ఫ్రెండ్లీ అ ట్మాస్పియర్‌'పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పాఠశాలల్లో ఉన్న చిన్న, చిన్న పరిష్కారానికి పంచాయతీల సహకారం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రధానంగా మరుగుదొడ్లు, కిటికీలు, తలుపులను వెంటనే పరిష్కరించాలన్నారు. పంచాయతీల ద్వారా లక్షా వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అమరేందర్‌రెడ్డి, బిల్‌ కలెక్టర్‌ బాలకృష్ణ, జీహెచ్‌ఎం రమేశ్‌, బాలికల పాఠశాల జీహెచ్‌ ఎం విజయలక్ష్మి, ఎంపీటీసీ మాధవి, సీఆర్పీ నారాయణ, ఉపాధ్యాయులు, అంగాన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.


VIDEOS

logo