ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Narayanpet - Dec 15, 2020 , 05:34:51

ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలి

ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలి

నారాయణపేట : సమాజంలో జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి ఆడపిల్లలు కరాటే నేర్చుకోవాలని డాక్టర్‌ జయచంద్రమోహన్‌ అన్నా రు. సోమవారం ఎల్‌బీ షోటోఖాన్‌ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్‌ గ్రేడింగ్‌ టెస్ట్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆ యన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలన్నారు. అ నంతరం టెస్ట్‌లో గెలుపొందిన 25 మంది విద్యార్థులకు మెరూన్‌, బ్లూ, ఆరెంజ్‌, ఎల్లో బెల్ట్‌లను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సత్యయాదవ్‌, కరాటే మాస్టర్‌ బాలరాజు, జూనియర్‌ మాస్టర్‌ మహేశ్‌, సంతోష్‌, వినయ్‌, కేశవ్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo