మంగళవారం 02 మార్చి 2021
Narayanpet - Dec 13, 2020 , 02:13:49

నిఘా వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలి

నిఘా వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలి

  •  ఇన్వెస్టిగేషన్‌ వర్టికల్‌ సీఐ శ్రీకాంత్‌రెడ్డి

నారాయణపేట : పోలీస్‌ సిబ్బంది వనరులను సమర్థవంతగా వినియోగించుకుంటూ నిఘా వ్యవస్థను పకడ్బందీగా అమలు చేసి పౌరుల ఆస్తుల ను కాపాడుతూ, నేరాలను నిరోధించాలని ఇన్వెస్టిగేషన్‌ వర్టికల్‌ సీఐ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం పోలీస్‌ సి బ్బందికి నేర నియంత్రణ, నేరస్తులపై నిఘా, ఇన్వెస్టిగేషన్‌ అంశాలపై వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నే రాలు చోటు చేసుకున్న వెంటనే స్పందించి పరిశోధనలు నిర్వహించి కేసును ఛేదించి బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. ప్రజలకు పోలీస్‌ వ్య వస్థపై నమ్మకం, గౌరవం పెరిగే విధంగా కృషి చే యాలని చెప్పారు. క్రైమ్‌ ప్రివెన్షన్‌ ఆండ్‌ డిటెన్షన్‌ స్టాఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న నే రాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నా రు. ఒక నేరస్తుడిని ఇంటరాగేషన్‌ చేయడంతో అ తను మొదటి నుంచి ఎన్ని నేరాలు చేశాడు, నేరం చేసిన విధానాలు, తోటి నేరస్తుల సమాచారం, నేరాలు చేయడానికి గల కారణాలు, బంధువులు, స్నేహితులు, నివాస ప్రాంతం, దొంగ సొత్తును విక్రయించుట తదితర విషయాలను తెలుసుకునే నైపుణ్యం కలిగి ఉండాలన్నారు. శిక్షణలో పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు. 


VIDEOS

logo