అధికంగా మొక్కలు నాటాలి

- హరితహారం లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
- రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా
నారాయణపేట టౌన్ : గతేడాది జిల్లాలో చేపట్టిన హరితహారం లక్ష్యాలకు తగ్గకుండా ఈ ఏడాది చేపట్టే ఆరో విడు త హరితహారం లక్ష్యాలను నిర్దేశించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా కలెక్టర్లకు సూచించారు. శనివా రం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా మాట్లాడారు. బయటి నర్సరీల నుంచి మొక్కలు కొనుగోలు చేసే పరిస్థితులు లేకుండా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని నర్సరీల్లో మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జనవరి చివరి నాటికి ప్లాస్టిక్ బ్యాగుల్లో మట్టి నింపి బెడ్లు తయారు చేసుకోవాలని, విత్తనాలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేసేలా కలెక్టర్లు ఆదేశాలు ఇవ్వాలన్నారు. నర్సరీల్లో పెంచిన మొక్కలు పెద్ద బ్యాగుల్లో మార్చే పక్రియను చేపట్టాలన్నారు. గ్రామాల్లో మరిన్ని పల్లె ప్రకృతి వనాలను పెంచాలన్నారు. మొక్కలను పెంచేందుకు అవసరమైన పనులు పక్కాగా నిర్వహించాలని, ప్రత్యక్షంగా నర్సరీలు, తనిఖీ చేసి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని, పల్లె ప్రకృతి వనాల్లో వాకింగ్ ట్రాక్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నర్సిరీల్లో అనుకున్న సమయంలో మొక్కలు పెరుగాలని తెలిపారు. మొక్కలు పెం చుతున్న ప్రాంతాల్లో ఎక్కడైనా ట్రీ గా ర్డులు పడిపోయిన వాటిని అప్పటికప్పుడు సరి చేసి మొక్క ఎదుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నా రు. ప్రతి శుక్రవారం వాటర్ డే పాటిం చి హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పోసే కార్యక్రమం తప్పకుండా ని ర్వహించాలన్నారు.
గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్‌రావు మాట్లాడుతూ హరతహారంలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు పంచాయతీ సెక్రటరీలు కృషి చేయాలన్నారు. గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో కేంద్ర బృందా లు ఆకస్మికంగా పర్యటించి అభివృద్ధి, పారిశుధ్యం తదితర అంశాలపై గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి పం చాయతీ సెక్రటరీలు, ఎంపీడీవోలు అప్రమత్తంగా ఉం డేలా ఆదేశించాలని కలెక్టర్లకు సూచించారు.
కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ జిల్లాలో 82.20లక్ష ల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకోగా 78.20 లక్ష ల మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. ఆరో విడుత హరితహారంలో 41.20లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పె ట్టుకున్నామన్నారు. అందు కోసం ఇప్పటి నుంచే ముందు కు సాగుతున్నామని ఆమె తెలిపారు. జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు, 3 మున్సిపాలిటీల్లోని నర్సరీల్లో మొత్తం 75 లక్షల మొక్కలను పెంచేలా చర్యలు తీసుకున్నామన్నా రు. కార్యక్రమంలో హరితహారం ప్రత్యేక అధికారి ప్రెయాం క నర్గీస్, అటవీశాఖ ప్రధాన పరిపాలకుడు సర్గం శ్రీనివాస్, డీఎఫ్‌వో గంగిరెడ్డి, డీపీవో మురళి, ఏపీడీ సత్యనారాయణ, ఎంపీడీవో సందీప్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆగస్టు 31 నుంచి కార్లలో కో-డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ మస్ట్.. మళ్లీ ధరలమోత!
- మాచా టీతో డిప్రెషన్ దూరం..!
- ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయం : మంత్రి కొప్పుల
- హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనత
- మోదీకి దీదీ కౌంటర్.. గ్యాస్ సిలిండర్‌తో పాదయాత్ర
- అధికారులను కొట్టాలన్న.. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై నితీశ్ స్పందన
- సర్కారు బెంగాల్‌కు వెళ్లింది, మేమూ అక్కడికే పోతాం: రైతులు
- ‘మల్లన్న ఆలయంలో భక్తుల సందడి’
- మహిళా ఉద్యోగులకు రేపు సెలవు : సీఎం కేసీఆర్
- ఆ సినిమాలో నా రోల్ చూసి నాన్న చప్పట్లు కొట్టాడు: విద్యాబాలన్