మంగళవారం 02 మార్చి 2021
Narayanpet - Dec 12, 2020 , 03:25:25

కల్లాలు నిర్మించుకోవాలి

కల్లాలు నిర్మించుకోవాలి

  •  అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి
  •  జిల్లాలో 2,441 మంజూరు
  •  కలెక్టర్‌ హరిచందన

ధన్వాడ : రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సిమెంట్‌ కల్లాలను నిర్మించుకోడానికి అవకాశం కల్పించిందని కలెక్టర్‌ హరిచందన అన్నారు. శుక్రవారం ధన్వాడ, మరికల్‌ మండలాల్లోని గోటూర్‌, రాంకిష్టయ్యపల్లి, పూసల్‌పహాడ్‌ తదితర గ్రామాల్లో కలెక్టర్‌ సిమెంట్‌ కల్లాల ను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం కిం ద చిన్న, సన్నకారురైతులు బీసీ, ఓసీలకు 90 శాతం సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ అందింస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. రైతు లు పండించిన ధాన్యా న్ని రోడ్డుపై ఆరవేయ డం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంద ని, ఈ విషయాన్ని గు ర్తించాలన్నారు.

భూమిపై ఆరవేయ డం వల్ల ధాన్యం వారం రోజులైనా ఎండే అవకాశం ఉండదని కలెక్టర్‌ చె ప్పారు. ఒకవేళ ఆకాల వర్షాలు వస్తే సిమెంట్‌ కల్లాలపై ఆరబోసిన ధాన్యా న్ని త్వరగా తీయడానికి అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో 2,441 కల్లాలు మంజూరు చేశామని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఏవోలు ప్రదీప్‌ కు మార్‌, శివకుమార్‌, గోటూర్‌ సర్పంచ్‌ నారాయణరెడ్డి, రాం కిష్టయ్యపల్లి సర్పంచ్‌ మాధవరెడ్డి, పూసల్‌పహాడ్‌ సర్పంచ్‌ యాదమ్మ, సింగిల్‌విండో వైస్‌ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డిలతోపాటుగా నాయకులు, రైతులు పాల్గొన్నారు.


VIDEOS

logo