శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Dec 11, 2020 , 03:08:05

ఆడబిడ్డలకు వరం

ఆడబిడ్డలకు వరం

  • కల్యాణలక్ష్మి : ఎమ్మెల్యే చిట్టెం

మక్తల్‌ రూరల్‌: ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి పథకమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో మాగనూర్‌ మండలానికి చెందిన 10మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే చిట్టెం మాట్లాడుతూ  ఆడబిడ్డల పెండ్లి  తల్లిదండ్రులకు భారం కావొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. దీంతో ఆడబిడ్డల తల్లిదండ్రులకు లబ్ధి చేకూరుతుందన్నారు. కుల మతాలకు అతీతంగా కల్యాణలక్ష్మి పథకం వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు అండగా నిలిచిందన్నారు. మహిళా సంఘాల ద్వారా రుణాలను అందించి ఆర్థికంగా ముందడుగు వేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం తెలిపారు. కార్యక్రమంలో మాగనూర్‌ జెడ్పీటీసీ వెంకటయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, కల్యాణలక్ష్మి లబ్ధిదారులు పాల్గొన్నారు. 

యమహా బైక్‌ షోరూం ప్రారంభం

మక్తల్‌ టౌన్‌: పట్టణంలో నూతనంగా రాజేశ్‌ యమహా బైక్‌ షోరూంను గురువారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి  ప్రారంభించారు.  నారాయణపేట రోడ్డులోని గణేశ్‌ ఫంక్షన్‌హాల్‌ ఎదురుగా షోరూంను ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేశ్‌గౌడ్‌, సోంభూపాల్‌గౌడ్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo