వైద్యం కోసం వెళ్తూ..

- కారు బోల్తా : నలుగురు దుర్మరణం
- డ్రైవర్‌కు తీవ్రగాయాలు
- ప్రాణాలతో బయటపడిన బాలుడు
- మక్తల్ మండలం గుడిగండ్ల వద్ద ఘటన
మక్తల్ రూరల్ : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడగా నలుగురు దుర్మరణం చెందిన సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామ శివారులో చోటు చేసుకున్నది. డీఎస్పీ మధుసూదన్‌రావు కథనం మేరకు..
హైదరాబాద్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉండే బడాంగ్పేటకు చెందిన మేస్త్రీ ఎల్లయ్య(55), అతడి భార్య గోవిందమ్మ(50), వదిన శారద(56, గోవిందమ్మ అక్క)కు మోకళ్ల నొప్పులకు వైద్య చికిత్సలు చేయించేందుకు కర్ణాటకలోని రాయిచూర్ పట్టణంలో ఉన్న నవోదయ దవాఖానలో బుధవారం అపాయిమెంట్ తీసుకున్నారు. ఈ క్రమంలో ఉదయమే ఈ ముగ్గురితోపాటు ఎల్లయ్య కూతురు హారిక(22), మనుమడు శార్విన్(4)తో కలిసి రాష్ట్ర రాజధాని నుంచి కారు(టీఎస్ 26 టీ, 6673)లో బయలుదేరారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో గుడిగండ్ల గ్రామ సమీపంలోని మలుపు వద్ద వేగంగా వస్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఎల్లయ్య, గోవిందమ్మ, శారద, హారిక అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ వినోద్(26)కు తీవ్ర గాయాలు కాగా.. మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాలుడు శార్విన్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. స్థానికులు స్థానిక ఆర్ఎంపీతో ప్రథమ చికిత్స చేయించారు. మృతదేహాలన్నీ ఘటనా స్థలంలోని గుంతలో చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న నారాయణపేట డీ ఎస్పీ మధుసూదన్‌రావు, మక్తల్ సీఐ శంకర్, ఎస్సై రాములు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్రామస్తుల సా యంతో మృతదేహాలను గుంతలోంచి బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారి బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాదం అలుముకున్నది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
- ఆ 2 సంస్థలతోనే శ్రీకారం: పీఎస్‌యూల ప్రైవేటీకరణపై కేంద్ర వ్యూహం
- మహిళల కోసం నీతా అంబానీ ‘హర్సర్కిల్’!
- కరోనా ఎపెక్ట్::మినిట్‌కు 5,900 సిరంజీల తయారీ!
- పాత వెహికల్స్ స్థానే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ
- ముత్తూట్ మృతిపై డౌట్స్.. విషప్రయోగమా/కుట్ర కోణమా?!
- శ్రీశైలం.. మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం
- స్విస్ ఓపెన్ 2021: మారిన్ చేతిలో సింధు ఓటమి
- తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా
- భైంసాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు